ఏపీలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు…రెండింట టీడీపీ ఆధిక్యం

-

విశాఖ రాజధానిని ఉత్తరాంధ్ర వాసులు కోరుకోవడంలేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ఏపీలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, రెండింట టీడీపీ ఆధిక్యంలో ఉంది. దాంతో టీడీపీ నేతల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ప్రజాగ్రహం ముందు మనీ పవర్, మజిల్ పవర్ నిలవలేవని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారని తెలిపారు.

Yanamala says no place for money and muscle power in front of peoples anger

కోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశంపై మాట్లాడడం తప్పు అని యనమల పేర్కొన్నారు. విశాఖ రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకోవడంలేదని అన్నారు. వైసీపీ తీరు చూసి విశాఖ ప్రజలు భయపడుతున్నారని వివరించారు. అప్పు తెచ్చిన నిధులు ఏంచేస్తున్నారో తెలియడంలేదని అన్నారు. అటు, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ పైనా యనమల స్పందించారు. అప్పుల గురించి బడ్జెట్ ప్రసంగంలో చెప్పకపోతే ఎలా? అని ప్రశ్నించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news