టెన్త్ తరవాత ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడ్డారా..? అయితే మంచి కోర్సుల గురించి ఇప్పుడే తెలుసుకోండి..!

-

జీవితంలో సక్సెస్ ని అందుకోవాలన్నా… మంచిగా టాప్ లో ఉండాలన్నా మనం ఎంచుకునే కోర్సు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకనే విద్యార్థులు పదే పదే తమ కోర్సుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా టెన్త్ పూర్తి చేశారా…? ఏం చదివితే బాగుంటుంది అన్న ఆలోచనలో పడ్డారా..? నిజానికి టెన్త్ తర్వాత ఎంచుకునే కోర్సు చాలా ముఖ్యం.

ఎందుకంటే దాని ఆధారంగా మీ కెరీర్ ని నిర్మించుకోవాల్సి ఉంటుంది. అయితే పదవ తరగతి వాళ్లకి కోర్సుల గురించి అంతగా అవగాహన ఉండదు. అందుకనే ఎవరినైనా అడిగి గైడెన్స్ తీసుకోవడం మంచిది. నిజానికి పిల్లలు తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులతో కానీ సీనియర్స్ తో కానీ కలిసి ఆలోచించుకుంటే మంచిది. అప్పుడు కోర్సుల గురించి క్లారిటీ వస్తుంది.

అలానే తాను ఏమి చదువు గలడు అనే విషయం కూడా విద్యార్థికి తెలుస్తుంది. ఏది ఏమైనా సరే తొందరగా నిర్ణయం తీసుకోకూడదు. విద్యార్థి యొక్క అభిరుచికి తగ్గట్టు కోర్సును ఎంచుకోవడం చాలా ముఖ్యం. నచ్చని కోర్సులో జాయిన్ చేస్తే విద్యార్థి చదవలేడు. అలానే అది బలహీనతగా అవుతుంది కానీ తాను సక్సెస్ అవ్వలేడు.

అందుకనే ప్రతి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని విద్యార్థి కోర్సును ఎంచుకోవడం అవసరం. టెన్త్ తర్వాత ఈ కోర్సులను విద్యార్థి ఎంచుకోవచ్చు. మరి ఇక ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. వీటిలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని ముందుకు వెళ్ళచ్చు. నిజానికి అభిరుచికి తగ్గట్టు విద్యార్థి కోర్సును ఎంపిక చేసుకుంటే అందులో రాణించడానికి సులభంగా ఉంటుంది. పైగా విద్యార్థి దానిని ఇష్టంగా చదువుతాడు కష్టంగా కాదు.

పదవ తరగతి పూర్తి చేసిన వాళ్ళు ఈ కోర్సులని ఎంచుకోవచ్చు:

సైన్స్:

మీకు సైన్స్ ఇష్టం ఉండి.. ఆ స్ట్రీమ్ ని ఎంపిక చేసుకోవాలి అంటే టెన్త్ తర్వాత సైన్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్ట్స్‌తో ఈ కోర్సు మీరు చదవచ్చు. సైన్స్ కి సంబంధించి స్ట్రీమ్స్ ని చూస్తే.. ఇంటర్‌లో ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ వంటివి ఉంటాయి. ఇంజనీరింగ్, వైద్య రంగం వైపు వెళ్లాలనుకునేవాళ్లు సైన్స్ కోర్సులను ఎంపిక చేసుకోచ్చు.

ఎంసెట్, జేఈఈ, బిట్‌శాట్, నీట్ పరీక్షల ద్వారా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందడం అవుతుంది. గ్రూపుల వివరాలలోకి వెళితే.. MPC – మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, MEC – మ్యాథ్స్, ఎకనమిక్స్, కామర్స్, MBPC – మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, BiPC – బయాలజీ(బాటనీ, జూవాలజీ), ఫిజిక్స్, కెమిస్ట్రీ.

కామర్స్:

బిజినెస్ మీద ఆసక్తి వుండే విద్యార్థులు ఈ స్ట్రీమ్ ని ఎంచుకోచ్చు. చార్టెర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, అకౌంటెంట్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వంటి వాటి కోసం ఈ స్ట్రీమ్ ని ఎంచుకోచ్చు.

కామర్స్‌లో బిజినెస్ ఎకనామిక్స్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీ, బిజినెస్ లా వంటివి ఉంటాయి. ఇంటర్‌లోనే సీఈసీ కోర్సులుంటాయి. గ్రూపుల వివరాలలోకి వెళితే.. CEC – సివిక్స్, ఎకనమిక్స్, కామర్స్, HEC – హిస్టరీ, ఎకనమిక్స్, సివిక్స్ లేదా కామర్స్.

ఆర్ట్స్:

ఆర్ట్స్ వైపు వెళితే కూడా మంచి ఆప్షన్స్ వున్నాయి. ఈ మధ్య కాలం లో చాలా మంది ఆర్ట్స్ ని కూడా ఎంపిక చేసుకుంటున్నారు. సైకాలజీ, పొలిటికల్ సైన్స్, ఫిలాసఫీ, హిస్టరీ, లిటరేచర్, సోషియాలజీ లాంటి సబ్జెక్ట్స్ ఇష్టమైతే వీటిని సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం.

అదే విధంగా ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, అరబిక్ లాంగ్వేజెస్ మీద కూడా కోర్సులు చేయొచ్చు. అలానే డిప్లొమా, వొకేషనల్, సర్టిఫికెట్ కోర్సులు కూడా ఉంటాయి. వీటిని కూడా టెన్త్ తరవాత ఎంపిక చేసుకోచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news