ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సంవత్సరం జరిగేలా కాకుండా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు స్వాతంత్ర దినోత్సవం వేడుకలపై ఆంక్షలు విధించారు. వైద్య ఆరోగ్య శాఖ సూచించిన సూచనల ప్రకారం మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం వేడుకలో తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా అన్ని జిల్లాల్లో న్యాయస్థానాలను ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కచ్చితంగా 50 మందితో మాత్రమే నిర్వహించాలి అని అది కూడా కేవలం 20 నిముషాలలో వేడుకలు ముగించాలి అని హైకోర్టు తెలిపింది. ఇంకా ఈ వేడుకలలో ఎలాంటి కార్యక్రమాలు జరపకూడదు అని హైకోర్టు ఆదేశాలు పేర్కొంది.