రేషన్‌ కార్డుదారులు..ఈ యాప్‌తో ఎక్కడనుంచైనా..!

-

రేషన్‌ కార్డుదారులకు గుడ్‌ న్యూస్‌. కేంద్రం ప్రవేశపెట్టిన ఓ యాప్‌తో దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఇందులో రేషన్‌ దుకాణానికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. కొవిడ్‌ నేపథ్యంలో కేంద్రం మొదటి వేవ్‌లో పేదలకు నెలకు రూ.500 వారి బ్యాంకు ఖాతా ద్వారా మూడు నెలలు ఇచ్చారు. రేషన్‌ కూడా ఉచితంగానే అందించారు. అయితే, రేషన్‌ కార్డుదారులు సులభంగా రేషన్‌ పొందడానికి ఓ యాప్‌ను కూడా తీసుకువచ్చింది.

 

Mera Ration Mobile App | మేరా రేషన్‌ యాప్‌
Mera Ration Mobile App | మేరా రేషన్‌ యాప్‌

దీంతో వారు దేశంలో ఎక్కడినుంచైనా రేషన్‌ పొందవచ్చు. అదే ‘మేరా రేషన్‌’ యాప్‌. ప్రతి పేదవాడికి రేషన్‌ అందేలా చూడటానికే ఈ యాప్‌ను రూపొందించినట్లు కే ంద్రం తెలిపింది. మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం ప్లే స్టోర్‌ నుండి అందుబాటులో ఉంటుంది. దీంతో దగ్గర్లో ఉన్న రేషన్‌ దుకాణం వివరాలతో పాటు వారు ఇచ్చే సరుకులు, వాటి ధరలు కూడా తెలుసుకోవచ్చు. మేరా రేషన్‌ యాప్‌ ను ఉపయోగించాలంటే ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయాలి.

రేషన్‌ కు సంబంధించి ప్రతీ వివరాలు ఇందులో పొందుపరిచారు. కొందరు వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండాల్సి వస్తుంది. అటువంటి వారికి గతంలో రేషన్‌ తీసుకోవడం ఇబ్బందిగా ఉండేది. ‘వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌’తో ఆ ఇబ్బందులు తొలగాయి. తెలియని కొత్త ప్రదేశంలో రేషన్‌ దుకాణం వివరాలు తెలుసుకోవడానికి ‘మేరా రేషన్‌’ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్డుదారులు రేషన్‌ పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news