భారత్ బయోటెక్ రూపొంచిన కరోనా వ్యాక్సిన్ కోవ్యాగ్జిన్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇండియా తయారు చేసిన మొట్ట మొదటి కరోనా వ్యాక్సిన్ అయినటువంటి కోవ్యాగ్జిన్ ని 18సంవత్సరాల పై వయస్సు వారికి ఉపయోగిస్తున్నారు. తాజాగా కోవ్యాగ్జిన్ ట్రయల్స్ పిల్లలపై ప్రారంభం కానున్నాయి. కోవ్యాగ్జిన్ పిల్లలపై ఎలా పనిచేస్తుందన్న విషయాన్ని తెలుసుకోవడానికి కోవ్యాగ్జిన్ ట్రయల్ మొదలు పెట్టనుంది. ఈ మేరకు ఢిల్లీ ఎయిమ్స్ వేదికగా ట్రయల్స్ నిర్వహించనుంది.
6-12సంవత్సరాల పిల్లలకు కోవ్యాగ్జిన్ వేయనున్నారు. ఇందులో బాల వాలంటీర్లను నియమించుకుంటున్నారు. ఇప్పటికే 12-18సంవత్సరాల పిల్లల్లో ట్రయల్స్ నిర్వహించారు. బీహార్ పాట్నాలోని ఎయిమ్స్, ఢిల్లీ ఎయిమ్స్ లో ఈ ప్రయత్నాలు జరగనున్నాయి. మరి కోవ్యాగ్జిన్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? పిల్లలపై దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలియడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.