గల్వాన్ గాయానికి ఏడాది.. కాసేపట్లో సంతోష్‌బాబు విగ్రహావిష్కరణ

-

హైదరాబాద్: లద్దాఖ్ గల్వాన్ గాయానికి ఏడాది పూర్తి అయింది. గత ఏడాది జూన్ 15న రాత్రి భారత సరిహద్దులో చైనా సైనికుల దుందుడుకు చర్యతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత సైన్యం, చైనా సైన్యం మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లెఫ్ట్‌నెంట్ కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది సైనికులు దేశం కోసం ప్రాణాలు విడిచారు. ఐదుగురు సైనికులు చనిపోయారని చైనా ప్రకటించింది. అయితే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు భారత్ -చైనా మధ్య కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నా పరిస్థితులు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.

ఇక దేశం కోసం అమరుడైన సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. సంతోష్ బాబు భార్యను ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. సూర్యాపేటలో సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రి కేటీఆర్ మంగళవారం సూర్యాపేటలో పర్యటించనున్నారు. కల్నల్ సంతోషబ్ బాబు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news