పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. డేట్స్ ఫైనల్ !

-

దేశంలో కరోనా వ్యాప్తి పెద్ద ఎత్తున ఉన్నా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నిర్వహణ దాదాపు ఖాయమయినట్టే. సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్‌ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభ నిర్వహించే సన్నాహాలు వేగవంతం చేసినట్టు చెబుతున్నారు.

పూర్తి భద్రతతో సామాజిక దూరం పాటించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో చర్చలు జరిపారని తెలుస్తోంది. పార్లమెంట్‌ సెక్యూరిటీ, సీపీడబ్ల్యూడీ, ఎన్‌డీఎంసీ, ఉభయసభల సెక్రెటరీ జనరల్స్‌, పార్లమెంట్‌ అధికారులతో లోక్ సభ స్పీకర్ బిర్లా సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌ నుంచి సభ్యులను, సిబ్బందిని రక్షించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, మార్గదర్శకాలపై ఈ చర్చ సుదీర్ఘంగా సాగింది. ప్రవేశ ద్వారాల వద్ద, పార్లమెంట్‌ భవనం లోపల, ఆవరణలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఓం బిర్లా పలు సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news