ఆపద వస్తే నారాయణ అంటూ నిత్యం తలుచుకునే ప్రజలకు దేవుడు కూడా కరోనా కారణంగా ఆలయాల్లో దర్శనమివ్వలేదు. భక్తుల మొరను కూడా ఆలకించడం లేదు. ఆ దేవుడి బాధ్యతలను వైద్యుడే తీసుకుని కరోనా రోగుల సేవలో నిమగ్నమయ్యారు. వైద్యోనారాయణో హరి అన్న నానుడి నిజం చేశారు. రోజుల తబడి ఆసుపత్రుల్లో ఉంటూ కరోనా రోగులకు వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లు నిజాంగానే దేవుళ్లయ్యారు.
తాజాగా గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు కు అరుదైన గౌరవం దక్కింది. కరోనా చికిత్స చేస్తున్న డాక్టర్స్ దేవుళ్లతో సమానం అని మాటల్లో చెప్పడమే కాదు చేతల్లో నిరూపించాడు మంచిర్యాల కు చెందిన రఫీక్ అనే వ్యక్తి. చావు బతుకుల్లో ఉన్న తనను గాంధీ డాక్టర్స్ బ్రతికించి పంపించారని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తనను సొంత కుటుంబ సభ్యునిలా చూసుకున్నారు ఆయన చెప్పుకొచ్చారు. ఆ అభిమానంతో రఫీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి రాజారావు ఫోటో కు పాలాభిషేకం చేశారు.