కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్‌

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో మంగళవారం (30-06-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 30th june 2020 tuesday

1. జూలై 1 నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్‌ 2.0 నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇకపై అలా కాకుండా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నవంబర్‌ వరకు పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు సరఫరా చేస్తామన్నారు.

2. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కరోనా ఇంకా ఎక్కువ మందికి సోకే అవకాశాలు ఉన్నాయని, దీన్ని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ ఒక్కటే పరిష్కారమని తెలిపింది.

3. చైనాలో మరో కొత్త వైరస్‌ను సైంటిస్టులు కనుగొన్నారు. దానికి జి-4 అని నామకరణం చేశారు. స్వైన్‌ ఫ్లూ వైరస్‌ హెచ్‌1ఎన్‌1 నుంచి ఇది ఉద్భవించిందని వారంటున్నారు.

4. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా ఉచిత పరీక్షలను మళ్లీ ప్రారంభించారు. నగరంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌, ఆయుర్వేదిక్‌ హాస్పిటల్‌, చార్మినార్‌ నిజామియా హాస్పిటల్‌లలో పరీక్షలను మళ్లీ ప్రారంభించారు.

5. తమిళనాడులో కరోనా విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 3943 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 90వేలు దాటింది. మొత్తం 50వేల మందికి పైగా డిశ్చార్జి కాగా 1201 మంది ప్రాణాలు కోల్పోయారు. 38వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

6. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 18,522 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,66,840కి చేరుకుంది. 16,893 మంది చనిపోయారు. 2,15,125 మంది చికిత్స పొందుతున్నారు.

7. కరోనా వైరస్‌కు గాను దేశీయ డ్రగ్‌ కంపెనీ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాక్సిన్‌ అనబడే వ్యాక్సిన్‌కు ఫేజ్‌ 1, 2 హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతినిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలు ఆదేశాలు జారీ చేశాయి. జూలై నెలలో ఈ ట్రయల్స్‌ ప్రారంభం అవుతాయి. ఫలితాలు ఆగస్టులో వచ్చే అవకాశం ఉంది.

8. కోవిడ్‌ నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం 2021 జూన్‌ వరకు పేదలకు ఉచితంగా రేషన్‌ సరుకులను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.

9. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 945 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,339కి చేరుకుంది. 7294 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం 260 మంది చనిపోయారు.

10. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధిస్తారని ప్రచారం జరుగుతుండడంతో అనేక మంది తమ సొంత ఊళ్లకు ప్రయాణమవుతున్నారు. దీంతో రహదారులపై వాహనాల రద్దీ నెలకొంది. కరోనా తగ్గాకే నగరానికి మళ్లీ వద్దామని చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news