తెలంగాణలో కరోనా విజృంభణ అస్సలు తగ్గడం లేదు. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పై దీని ప్రభావం అధికంగా ఉంది. కాగా.. తాజాగా.. తెలంగాణలో గత 24 గంటల్లో 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఏడుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,339కు చేరుకోగా, మరణాల సంఖ్య 260కి చేరింది. తాజాగా 1712 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7294కు చేరింది. రాష్ట్రంలో ఇంకా యాక్టివ్ 8,785 కరోనా కేసులున్నాయి. ఈ మేరకు వైద్యరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
తెలంగాణలో మరో 945 కరోనా పాజిటివ్ కేసులు..!
-