కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో సోమవారం (31-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. ఢిల్లీలో కొత్తగా 1358 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,74,748కు చేరుకుంది. మొత్తం 4,444 మంది చనిపోయారు. 1,55,678 మంది కోలుకున్నారు. 14,626 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
2. తమిళనాడులో కొత్తగా 5,956 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,28,041కి చేరుకుంది. 7,332 మంది చనిపోయారు. 59,900 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,68,141 మంది కోలుకున్నారు.
3. కర్ణాటకలో కొత్తగా 6,495 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,42,423 కు చేరుకుంది. 2,49,467 మంది కోలుకున్నారు. 87,235 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,702 మంది చనిపోయారు.
4. ఏపీలో కొత్తగా 10,004 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,34,771కు చేరుకుంది. 1,00,276 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,30,526 మంది కోలుకున్నారు. 3,969 మంది చనిపోయారు.
5. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆయన హాస్పిటల్‌లో చేరారు. సోమవారం కన్నుమూశారు.
6. భారత్ బయోటెక్ రూపొందించిన కో వ్యాక్సిన్‌కు రెండో దశ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి దశ ట్రయల్స్ విజయవంతంగా కాగా.. రెండో దశ ట్రయల్స్ ను చేపట్టారు.
7. కళ్ల అద్దాలపై కరోనా వైరస్ 9 రోజుల వరకు జీవించి ఉంటుందని సైంటిస్టులు తేల్చారు. బయటకు వెళ్లి వచ్చాక కళ్ల అద్దాలను శుభ్రం చేసుకోవాలని, లేదంటే వాటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు.
8. తెలంగాణలో కొత్తగా 1873 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,24,963కు చేరుకుంది. 92,837 మంది కోలుకున్నారు. 31,299 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 827 మంది చనిపోయారు.
9. కరోనా వైరస్ నేపథ్యంలో భారత దేశ జీడీపీ చాలా తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతం పతనమైంది. లాక్‌డౌన్ వల్లే ఈ పరిస్థితి చోటు చేసుకుందని నిపుణులు అంటున్నారు.
10. మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోనే ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా బయట పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో 70 శాతం కేసులు ఈ రాష్ట్రాల్లోనే నమోదైనట్లు గుర్తించారు.