తెలంగాణలో ప్రారంభమైన కోవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ ప్రక్రియ

-

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ బూస్ట‌ర్ డోస్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. 5 ల‌క్ష‌ల కార్బేవ్యాక్స్ టీకా డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర ప్ర‌భుత్వం. బుధ‌వారం నుంచి రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో ఈ బూస్టర్ డోస్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా చాలా పిహెచ్సీలకు బూస్టర్ డోసులు అందలేదు.

ఒకసారి బూస్టర్ తీసుకున్న వారు ఆరునెలలు గడిచిన తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని చెబుతుంది ప్రభుత్వం. బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే ప్రస్తుతం ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేమన్నారు రంగారెడ్డి డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు. బూస్టర్ డోస్ తీసుకునే వారి వివరాలు పోర్టల్ లో నమోదు కావడం లేదని.. కోవిడ్ వ్యాక్సిన్ పోర్టల్ లో మార్పులు చేయాల్సి ఉందన్నారు. మొద‌టి రెండు డోసులు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ తీసుకున్నా.. బూస్ట‌ర్ డోస్ గా కార్బేవ్యాక్స్ తీసుకోవ‌చ్చని తెలిపారు రంగారెడ్డి డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు.

Read more RELATED
Recommended to you

Latest news