ఒకే వ్యక్తికి కొవిడ్‌, మంకీపాక్స్‌, హెచ్‌ఐవీ పాజిటివ్‌.. అసలు ఏం చేశాడంటే..!

-

కొవిడ్‌తోనే ఆగం ఐతున్నాం అంటే.. ఒకే వ్యక్తికి కొవిడ్‌, మంకీపాక్స్‌ బోనస్‌గా హెచ్‌ఐవీ మొత్తం మూడు వచ్చాయి.. వైద్య చరిత్రలోనే ఇది ఒక సంచలనం అని నిపుణులు అంటున్నారు. ఇటలీకి చెందిన ఓ వ్యక్తికి కొవిడ్ – 19, మంకీపాక్స్, హెచ్​ఐవి -1 కి ఒకేసారి పరీక్షలు చేయగా.. అన్నింట్లోనూ పాజిటివ్​ వచ్చాయని.. ఇలా అన్ని పాజిటివ్​ వచ్చిన మొదటి కేసు ఇదేనని శాస్త్రవేత్తలు తెలిపారు.. ఇన్ని వచ్చాయంటే.. మనోడు ఏం చేసి ఉంటాడు..? అసలు విషయం తెలిస్తే మీరు కచ్చితంగా షాక్‌ అవుతారు.!
ఇటలీకి చెందిన వ్యక్తి.. ఈ సంవత్సరం జూన్​లో స్పెయిన్ పర్యటనకు వెళ్లాడు. టూర్​కి వెళ్లిన అతను జూన్ 16 నుంచి 20 వరకు స్పెయిన్‌లో ఐదు రోజులు ఉన్నాడు. ఆ సమయంలో అసురక్షిత లైంగిక సంబంధంలో పాల్గొన్నాడు. కట్ చేస్తే.. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తొమ్మిది రోజుల తర్వాత అలసట, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు..జూలై 2న ఆ వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్​గా నిర్ధారణ అయింది. అదే రోజు మధ్యాహ్నం అతని ఎడమ చేతిపై దద్దుర్లు రావడం ప్రారంభమయ్యాయి… మరుసటి రోజు అతని మొండెం, దిగువ అవయవాలు, ముఖం, గ్లూట్స్‌పై దద్దుర్లు వచ్చాయని జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్‌లో ప్రచురించిన కేస్ స్టడీ నివేదికలో పేర్కొన్నారు..
జూలై 5 నాటికి వెసికిల్స్ మరింత వ్యాప్తి చెంది… చర్మంపై చిన్న గడ్డలుగా మారాయట.. ఆ సమయంలో వ్యక్తిని ఇటలీలోని కాటానియాలోని శాన్ మార్కో యూనివర్శిటీ హాస్పిటల్‌లోని అత్యవసర విభాగానికి తరలించారు. అనంతరం ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగానికి బదిలీ చేశారు. మంకీపాక్స్ కూడా సోకిందని తేలింది. రోగికి బహుళ STI పరీక్షలు నిర్వహించగా.. అతను HIV-1 పాజిటివ్ అని వెల్లడైంది..
అతని CD4 గణనను బట్టి.. సంక్రమణ సాపేక్షంగా ఇటీవలిదేనని తేలినట్లు వైద్యులు తెలిపారు. కొవిడ్ -19, మంకీపాక్స్ కోలుకున్న తరువాత.. రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు. మొత్తానికి విహార యాత్ర కాస్త ఓదార్పు యాత్రగా మిగిలిపోయింది.!

Read more RELATED
Recommended to you

Latest news