కోవిడ్ కల్లోలం.. డెల్టా దాడిలో ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మంది డెడ్

ఇప్పట్లో కోవిడ్ ప్రపంచాన్ని వదిలిపోయేలా లేదు. వివిధ రకాలు రూపాలు మారుస్తూ కొత్తకొత్త స్ట్రెయిన్ల రూపంలో జనాలపై దాడులు చేస్తూనే ఉంది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు బాధితులుగానే ఉన్నాయి. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు వ్యాక్సిన్ ను వేగిరం చేశాయి. తాజాగా డెల్టా స్ట్రెయిన్ కరోనా రకం వల్ల ప్రపంచంలో 50 లక్షల మంది మరణించినట్లు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది.

 ప్రపంచంలో సగాని కన్నా ఎక్కువ కేసులు కేవలం అమెరికా, బ్రెజిల్, మెక్సికో, రష్యా, ఇండియాలో నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. మొత్తం మరణాల్లో 25 లక్షల మంది ఏడాదిలో చనిపోతే.. డెల్టా కారణంగా కేవలం 8 నెలల్లోనే మరో 25 లక్షల మంది మరణించినట్లు నివేదిక తెలిపింది. సగటున రోజులకు 8 వేల మరణాలు చోటు చేసుకుంటే, నిమిషానికి 5 మరణాలు సంబవిస్తున్నట్లు నివేదిక తెలిపింది. గడిచిన కొన్ని వారాలుగా ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు తగ్గుతుందని తెలిపింది. వ్యాక్సిన్ వేగవంతం చేయడం కారణంగా మరణాలు రేటు తగ్గుతున్నట్లు నివేదికలో వెల్లడించింది.