కరోనా వ్యాక్సినేషన్ .. ముందువరసలో ఇండియా..

-

కరోనా విషయంలో ఇండియా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. దేశ ప్రజలకు వేగవంతంగా వ్యాక్సిన్ అందిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో 86 కోట్ల డోసులకు పైగా వ్యాక్సినేషన్ పూర్తయింది. దాదాపుగా దేశ జనాభాలో 22 కోట్లకు పైగా ప్రజలు పూర్తి వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. అభివ్రుద్ధి చెందిన దేశాలు కూడా భారత్ తర్వాతే ఉన్నాయి. ప్రపంచంతో డోసులు, పూర్తి వ్యాక్సినేషన్ తీసుకున్నవారిని తీసుకుంటే సంఖ్యాపరంగా ఇండియా ముందువరసలో ఉంది. ప్రపంచ దేశాలు కూడా తమ ప్రజలకు వ్యాక్సినేషన్ను వేగవంతం చేస్తున్నాయి. యూఎస్, యూకే, ఇండియా, చైనా, రష్యా వంటి దేశాలు సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసుకున్నాయి. మిగతా దేశాలు కొనుగోలు ద్వారా వ్యాక్సిన్ దిగుమతి చేసుకుంటున్నాయి. ఇండియాలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు ఎక్కువగా ఇస్తున్నారు. వీటితో పాటు పలురకాల విదేశీ వ్యాక్సిన్లను కూడా భారత్ లో వినియోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో కోవిన్ వ్యాక్సిన్ అందించేందుకు స్వయంగా హెల్త్ వర్కర్లు ప్రజల వద్దకు వెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news