ప్రపంచంలో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది. 2019 డిసెంబర్లో చైనా లోని హుబే ప్రావిన్స్ లోని వూహాన్ నగరంలో కోవిడ్ కేసులు మొదలయ్యాయి. తక్కువ కాలంలో ఇటలీ, ఇటలీ, స్పెయిన్, ఇరాన్ ఇలా దేశాలకు వ్యాప్తి చెందుతూ… నేడు ప్రపంచ దేశాలకు మహమ్మారి పాకింది. తాజాగా ఆదివారం ప్రపంచంతో కోవిడ్ కేసుల సంఖ్య 25 కోట్లకు చేరింది. తన రూపును మార్చుకుంటూ కొత్త కొత్త వేరియంట్ల రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రస్తుతం యూరప్, రష్యా, ఆగ్నేయాసియా దేశాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది.
ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయిన దేశాల జాబితాలో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇండియా, బ్రెజిల్ దేశాలు నిలిచాయి. అమెరికాలో ఇప్పటి వరకు 4.73 కోట్ల కేసులు నమోదయ్యాయి. వీరిలో సుమారు 7,75,000 మంది మరణించినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఇండియాలో ఇప్పటి వరకు 3.43 కోట్ల కేసులు నమోదయితే 4,60,787 మరణాలు సంభవించాయి. బ్రెజిల్ దేశంలో 2.18 కోట్ల కేసులు నమోదైతే.. 609,417 మరణాలు సంభవించాయి.