చిరంజీవి ఊసరవెళ్లి అయితే..పవన్ ల్యాండ్ మైన్ అంటూ సీపీఐ నారాయణ కామెంట్లు చేశారు. కేంద్రం ఏపీకి చేసింది శూన్యమని.. ఎన్డీయే బలపరచిన అభ్యర్థికి ఎందుకు ఎపిలో అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నేతల బ్లాక్ మెయిలింగ్ లకు ఎపిలో నేతలు భయపడుతున్నారని.. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సమయంలో నటుడు క్రిష్ణను సభా వేదికపై తీసుకువచ్చి ఉంటే బాగుండేదన్నారు.
ఊసరవెల్లిలాగా ప్రవర్తించే చిరంజీవిని సభావేదికపై తీసుకురావడం సరైంది కాదని.. పవన్ కళ్యాణ్ ల్యాండ్ మైన్ అని నిప్పులు చెరిగారు. ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో పవన్ కళ్యాణ్ కు తెలియదని.. ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన చేస్తున్న నిరసనలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ రాజధాని అనే భావనను వైసిపి పోగొడుతోందని.. రాష్ట్రం విడిపోయినా ఇంకా హైదరాబాద్ రాజధాని అనుకుంటున్నారని వైసిపి నేతలపై ఆగ్రహించారు. రాజధాని కావాలన్న చిత్తశుద్థి వైసిపికి ఏ మాత్రం లేదని.. రెండు రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు రాకుండా చూడండని చురకలు అంటించారు నారాయణ.