విడతలవారీగా టీడీపీ నేతగా మారిపోతున్న సీపీఐ నేత!

-

కమ్యునిస్టులంటే ఒకానొక సమయంలో విపరీతమైన గౌరవం, అంతకు మించి ప్రేమ సామాన్య జనంలోని కొందరిలో ఉండేవి! చాలా రాజకీయ పార్టీలు కూడా వీరి ఆలోచనలకు, వామపక్ష బావజాలాలకు పరోక్షంగా ఫ్యాన్స్ అయిపోయేవారు. ప్రజల్లో కూడా కమ్యునిస్టులకు పాపులారిటీ ఎలా ఉండేదంటే… ఏదైనా సమస్య వస్తే.. “వారున్నారులే” అనేటంత! కానీ రోజులు మారాయి.. గత త్యాగాధనుల త్యాగాలమీద నిలబడిన పార్టీపై నిలబడి చాలా మంది నేతలు నేడు కమ్యునిస్టులుగా బ్రతికేస్తున్నారు! మావోయిస్టు సానుభూతిపరులు మాత్రమే కమ్యునిస్టులు అనే ఆలోచనలు కూడా మరికొందరు ఈ రోజుల్లో కూడా చేస్తున్నారు.

ఆ సంగతులు అలా ఉంటే… వారిది ఎప్పుడూ ప్రతిపక్షమే, వారిది ఎప్పుడూ ప్రజల పక్షమే అనే పేరు సంపాదించుకున్న కమ్యునిస్టు పార్టీల్లో ఒకటైన సీపీఐ నుంచి ఆ పార్టీ నేత రామకృష్ణ తాజాగా నిర్మలా సీతారమన్ వ్యాఖ్యలపై స్పందించారు. ఏపీకి విద్యుత్‌ ను రూ.2.70 పైసలకు అందిస్తుంటే ఏపీలో రు.9కు అమ్ముతున్నారని నిర్మళా సీతారామన్ స్పందించగా.. ఏపీలో ఇండస్ట్రియల్ విద్యుత్ టారిఫ్ రూ.7.65 అని.. 2017లో నాటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టారిఫ్‌ నే ఇప్పటికీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందని.. నిర్మల చెబుతున్న రూ.9 ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదని.. రూ. 2.75కి విద్యుత్‌ ను ఎక్కడ ఇస్తున్నారో కేంద్రం చెప్పాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం డిమాండ్ చేశారు.

ఈ రెండు విషయాలపై బాధ్యతాయుతమైన వ్యక్తులు, రాష్ట్ర ప్రయోజనాల గురించి, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాల్సిన నేతలు ఎవరినా ఎలా స్పందిస్తారు? కానీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాత్రం… జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసేలా స్పందించారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడతారని తెలుసు కానీ నిర్మలా సీతారామన్‌కు కూడా భయపడతారా? అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం దీనిపై వైకాపా నేతలు ఫైరవుతున్నారు.

వరుసగా 20 రోజులకు పైగా కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేస్తుంటే తమదైన శైలిలో స్పందించాల్సిన నేతలు.. చేతకాక చేవలేక వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం ఏమిటి.. అంత ప్రాముఖ్యమైన విషయాన్ని వదిలి.. నిర్మల చేసిన వ్యాఖ్యలపై అజయ్ కల్లం మాట్లాడితే ఏమిటి? జగన్ మాట్లాడితే ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం అందిందా లేదా అన్నదే ముఖ్యం అన్న విషయం మరిచి.. సీఎం పై వ్యక్తిగత విమర్శలు చేయడం ఏమిటని కామెంట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో విడతలవారీగా టీడీపీ నేతగా మారిపోతున్న రామకృష్ణ… అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడాన్ని కూడా తప్పుబట్టిన విషయాన్ని వైకాపా నేతలు గుర్తుచేస్తున్నారు.

అవును… నాడు అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడి అరెస్టును కూడా రామకృష్ణ తప్పుపట్టారు. దీంతో పార్టీ ప‌రువును రామ‌కృష్ణ బ‌జారుకీడుస్తున్నార‌ని ఆ పార్టీ అనుబంధ కార్మిక యూనియ‌న్ ఏఐటీయూసీ కార్య‌క‌ర్త‌లు నాడు తీవ్రంగా ధ్వ‌జ‌మెత్తారు. దీంతో… కార్మికుల‌కు అండ‌గా నిల‌వాల్సిన స‌మ‌యంలో సొంత ఎజెండాతో చంద్ర‌బాబుకు కొమ్ముకాస్తున్నారని, భావజాలాలకంటే వర్గాలకే రామకృష్ణ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే కామెంట్లు బలంగా వినిపించాయి!

Read more RELATED
Recommended to you

Latest news