ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఘటనపై ఇంకా విమర్శులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే.. ఇప్పటికే అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఈ వీడియో గోరంట్ల మాధవ్‌ది కాదని స్పష్టం చేసినప్పటికే ప్రతి పక్ష నేతలు మాత్రం ఈ విషయాన్నే చూపుతూ అధికార వైసీపీపై వ్యంగ్యస్ర్తాలు సంధిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ (గోరంట్ల మాధవ్)ని రక్షించడమే ప్రభుత్వ ధ్యేయమా? అని ప్రశ్నించారు రామకృష్ణ. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో అది నకిలీ వీడియో అని ఎస్పీ ఫకీరప్ప తేల్చేశారని వెల్లడించారు. ఎలాంటి విచారణ లేకుండా ఎస్పీ అది ఫేక్ వీడియో అని చెప్పగలరని ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ.
వెంటే ఎంపీపై చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అటు, హత్య చేసిన ఎమ్మెల్సీ (అనంతబాబు)ని కాపాడడమే ప్రభుత్వ ధ్యేయమా? అని నిలదీశారు రామకృష్ణ. 90 రోజుల్లో చార్జిషీటు వేయకుండా ఎమ్మెల్సీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ వచ్చేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. అనంతబాబు కేసులో ప్రభుత్వ వైఫల్యంపై ఉద్యమిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు. వ్యక్తిని చంపి కారులో డోర్ డెలివరీ ఇచ్చిన ఎమ్మెల్సీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అని నిలదీశారు రామకృష్ణ.