ఇదేం క్రేజ్​రా బాబు.. అప్పుడు విజయ్​ కోసం.. ఇప్పుడీ హీరో కోసం.. ఎగబడుతున్నారుగా !

-

సాధారణంగా ఓ సినీ సెలబ్రిటీ బయటకు వస్తే అక్కడ ఫ్యాన్స్​, స్థానికులు గుమిగూడటం సహజం. అదే ఓ స్టార్ హీరో లేదా హీరోయిన్​ సందడి చేస్తే.. ఆ ప్లేస్​ అభిమానులతో కిక్కిరిసిపోతుంది. లైగర్​ ప్రమోషన్స్​లో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటన చేస్తున్న సెన్సేషనల్​ స్టార్​ విజయ్​దేవరకొండ క్రేజ్​ను మనం చూస్తూనే ఉన్నాం. షాపింగ్​ మాల్స్​, కాలేజెస్​.. ఇలా ఆయన ఎక్కడ ప్రచారం​ చేస్తున్నా అవి ఫ్యాన్స్​తో కిక్కిరిసిపోతున్నాయి. పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది.

తనకున్న ఫ్యాన్​ ఫాలోయింగ్​ చూసి విజయే ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి అనుభవమే మరో హీరోకు ఎదురైంది. తన చూడటానికి వచ్చిన భారీ అభిమానగణాన్ని చూసి ఆశర్యపోయాడు. తనపై చూపించిన ప్రేమ, అభిమానానికి హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపాడు. సోషల్​మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోస్​, వీడియోస్​ వైరల్​గా మారాయి. అతడెవరంటే?

వైవిధ్యమైన కథలతో తరచూ ప్రేక్షకుల్నీ ప్రేక్షకుల్నీ అలరిచించే మాలీవుడ్​ స్టార్ టొవినో థామస్​. ‘మారి 2’, ‘లూసీఫర్‌’, ఫొరెన్సిక్​, కాలా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడయ్యాడు. ఇటీవలే కీర్తిసురేశ్​తో కలిసి ఆయన నటించిన ‘వాసి’ సినిమా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్​ను అందుకుంది. తెలుగు వెర్షన్​లో బానే ఆకట్టుకుంది. అయితే ఇప్పుడాయన నటిస్తున్న కొత్త చిత్రం ‘థల్లుమాలా'(Thallumaala). ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా కొజికోడ్‌ ప్రాంతంలో ఓ మాల్​లో ప్రమోషన్స్​ ఏర్పాటు చేశారు. అయితే థామస్​ను చూసేందుకు అక్కడికి భారీ ఎత్తున ఫ్యాన్స్​ తరలివచ్చారు. దీంతో మాల్​ మొత్తం ఇసుక పోస్తే రాలనంత జనంతో నిండిపోయింది. వారిని కంట్రోల్​ చేయడం కష్టమైంది.

దీంతో చేసేదేమిలేక ఆ ఈవెంట్​ను క్యాన్సిల్​ చేయాల్సి వచ్చింది. అయితే ఈ ఈవెంట్​కు సంబంధించిన ఫొటోలను సోషల్​మీడియాలో పోస్ట్​ చేసిన థామస్​ షాక్ అయినట్లు తెలిపాడు. ఇంత మంది వస్తారని తాను ఊహించలేదని పేర్కొన్నాడు. తనపై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి కృతిజ్ఞతలు తెలిపాడు.

కాగా, థల్లుమాలా చిత్రాన్ని ఖలీద్​ రెహ్మన్​ తెరకెక్కించారు. కల్యాణి ప్రియదర్శన్​, షైన్​ టామ్​ చాకో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలై పోస్టర్​, ట్రైలర్​ సినిమాపై అంచనాలను పెంచాయి. సోషల్​మీడియాలో కూడా బాగా ట్రెండ్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news