క్రేజీ అప్డేట్: “మహేష్ బాబు – త్రివిక్రమ్” మూవీ అప్డేట్ !

టాలీవుడ్ మాటల మాంత్రికుడు మరియు వయసు పెరుగుతున్నా అందాన్ని తిన్నాడేమో అన్నట్లుగా ఇంకా అందగాడిలా మారుతున్న మహేష్ బాబు ల కాంబోలో ఇప్పటికే అతడు మరియు ఖలేజా చిత్రాలు తెరకెక్కాయి. ఇందులో ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోగా , ఇంకొక మూవీ మాత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే వీరిద్దరూ మళ్ళీ సినిమా చేసే అవకాశం అయితే రాలేదు. ఆ తర్వాత SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను షూట్ చేస్తన్నారు.

ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 28 వది కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం మరో అప్డేట్ ను అందించడానికి సిద్ధం అవుతూ ఉంది. మే 31వ తేదీన మహేష్బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతి కావడం వలన… ఆ రోజున టైటిల్ ను రివీల్ చేసే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు చిత్రపురి నుండి సమాచారం అందుతోంది. మరి ఆ అప్డేట్ ఏమై ఉంటుందా అని అందరికీ సస్పెన్స్ గా ఉంది.