కన్న కూతురుపై లైంగిక దాడి చేయించింది ఓ తల్లి. ఈ సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాలలోకి వెళితే…. చెన్నైకి చెందిన కమల అనే మహిళ కూలీగా పనిచేస్తోంది. ఆమెకు ఇంటర్ చదివే కూతురు ఉంది. ఆ మహిళకు ఓ 50 ఏళ్ల వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే అతడు ఆ మహిళ కూతురిపై కన్నేశాడు. బాలికను పెళ్లి చేసుకుంటానని ఆ మహిళకు చెప్పాడు.
దీనికి ఆ తల్లి అంగీకరించింది. తన కుమార్తెపై లైంగిక దాడి చేసేందుకు తన ప్రియుడికి సహకరించింది కమల. దీంతో పలుమార్లు అతడు ఆ మైనర్ బాలిపై లైంగిక దాడి చేశాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది.
బాధిత బాలికను గర్భంతో చూసిన ఇరుగుపొరుగు వారు ఆమె తల్లిన ప్రశ్నించారు. తన కూతురికి పెళ్లి చేసినట్లు ఆమె వారికి చెప్పింది. ఆ బాలిక మే 1వ తేదీన ఇంట్లోనే ఓ బిడ్డకు జన్మనించింది. అయితే.. ఈ విషయం తెలిసిన శిశు సంక్షేమ కమిటీ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిని అరెస్టు చేశారు పోలీసులు.