ఎక్కడ చూసిన స్త్రీలపై అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు కామాంధుల వల్ల మంచి వాళ్లకు చెడ్డ పేరు వస్తోంది. అయితే.. తాజాగా జార్ఖండ్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఝార్ఖండ్ పాలము ప్రాంతంలోని సాత్ బర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం దారుణం జరిగింది.
ఓ మహిళ భర్తపై అలిగి పుట్టింటికి బయలుదేరింది. ఆమె వెంటే భర్త బ్రతిమిలాడుతూ వెళ్ళాడు. బాధితురాలి బావ కూడా వచ్చి ఆమెకు నచ్చ చెప్పాడు. ఇంతలో ఆరుగురు దుండగులు వచ్చి బాధితురాలి భర్తను, బావను స్పృహ తప్పేలా కొట్టారు. ఆపై భర్త కళ్ళముందే భార్యపై సామూహిక అత్యాచారం చేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.