క్రైమ్ న్యూస్: అమ్మాయి కోసం వెళ్లిన యువకుడిని చంపేసిన కుటుంబం…

నేటికాలంలో యువకులు ప్రేమ అనే మత్తులో పడి భవిస్యత్తును ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు. తాజాగా తెలిసిన ఒక సమాచారం ప్రకారం యువకుడు అమ్మాయి కోసం అని వెళ్లి ఇంటి సభ్యుల చేతిలో శవమయ్యాడు. ఈ ఘోరమైన ఘటన తెలంగాణ రాష్ట్రము నల్గొండ జిల్లా గుర్రపాడు కొప్పోలు గ్రామంలో చోటు చేసుకుంది. దుగినెల్లి గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడు కొప్పోలుకు చెందిన అమ్మాయిని కొంతకాలముగా ప్రేమిస్తున్నానని వెంటపడేవాడట. అయితే ఆ అమ్మాయికి సంతోష్ అంటే ఇష్టం లేకపోవడంతో దూరం పెడుతూ వచ్చింది. గతంలో ఈ విషయం తెలిసిన బంధువులు సంతోష్ ను హెచ్చరించారు.

 

అయితే అతను వినకుండా నిన్న సంతోష్ ఏకంగా తన ఊరు కొప్పోలులోని అమ్మాయి ఇంటికి వెళ్లగా ఆగ్రహించిన ఇంటి సభ్యులు మరియు బంధువులు అతనిని అక్కడికక్కడే కొట్టి చంపేశారు. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రేమిస్తే చంపేస్తారా అంటూ సంతోష్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.