గరుడ పురాణం: ఇలాంటి బ్రహ్మణులతో పూజలు చేయిస్తే ఎలాంటి ఫలితాలు ఉండవు.!

-

హిందువులు బ్రాహ్మణులను దైవసమానులుగా భావిస్తారు. ఎలాంటి కార్యమైనా వారి సలహాలు సూచనలు తీసుకుని మాత్రమే మొదలుపెడతారు. అయితే బ్రాహ్మణులంతా దైవసమానులు కాదు.. కొంతమంది బ్రహ్మణులతో పూజలు చేయిస్తే అవి సత్ఫలితాలను ఇవ్వవు. ఎలాంటి బ్రాహ్మ‌ణులు ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేయాలో గ‌రుడ పురాణంలో స్ప‌ష్టంగా పేర్కొన్నారు. గరుడ పురాణంలో కొందరు బ్రాహ్మణులు లేదా పండితుల సమక్షంలో పూజలు, హోమం-హవనాలు చేయకూడదని చెప్పారు. వాళ్లు ఎవరంటే..

మంత్రగాళ్లు

మంత్రవిద్య లేదా భూతవైద్యం చేసే పూజారులు ఎప్పుడూ యాగం, పూజ లేదా శ్రాద్ధ కర్మలు చేయకూడదు. ఈ పండితుడిని శ్రాద్ధ కార్య‌క్ర‌మాల‌కు ఎంచుకుంటే పూర్వీకులు నిరాదరణకు గురవుతారని గరుడ పురాణంలో పేర్కొన్నారు. వారిలో ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు అలాంటి వారి చేత పూజ, హోమం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఫ‌లితంగా ఇది సమస్యలను పెంచుతుంది.

ఈ 4 రకాల బ్రాహ్మణులు

మేకలు మేపే బ్రాహ్మణుడు, బొమ్మలు గీసే బ్రాహ్మణుడు, బ్రాహ్మణ వైద్యుడు, జ్యోతిష్యంలో నిమగ్నమైన వారు ఎలాంటి పూజలు, హోమాలు చేయకూడదు. ఈ నాలుగు రకాల బ్రాహ్మణులతో పూజలు, హోమాలు చేయించ‌డం వల్ల మనం చేసే పూజకు ఫలితం ఉండదని గరుడు పురాణంలో పేర్కోన్నారు..

అత్యాశ, అజ్ఞానం ఉన్న‌వారు

వేదాలు చదవని, అంటే వేదాల గురించి తక్కువ జ్ఞానం ఉన్న బ్రాహ్మణుడితో పూజలు చేయించకూడదు.. ధనాపేక్షతో హోమం చేసే పండితులచే పూజలు చేస్తే అవి వృథా అవుతాయి. అటువంటి పండితులు కేవలం ధనాపేక్షతో పూజ, హోమాలు చేస్తారు తప్ప పూజా ఫలితాల కోసం కాదు.

అసూయపడే వారు

ఇతరుల సంతోషానికి అసూయపడే, చెడు చేసే బ్రాహ్మణుడితో పూజ-పునస్కారాలు, హోమం-హవనాలు చేయించకూడదు. అలాంటి పండితులు ఇతరుల సంతోషం కోసం పూజించరు. బదులుగా, వారికి చెడు జ‌ర‌గాల‌ని కోరుకుంటారు..

హింస చేసే బ్రాహ్మణులు

ఎప్పుడూ ఇతరుల సొమ్ము తీసుకునేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, హింస చేసేవాడు మంచి పండితుడు కాలేడని గరుడ పురాణం చెబుతోంది. ఈ పండితులు లేదా బ్రాహ్మణులు ఎప్పుడూ పూజ చేయకూడదు. మనం ఈ తప్పు చేస్తే వారి పాప కర్మలలో పాలుపంచుకుంటాము.

దుష్ట ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు

ఎప్పుడూ ఇతరులను విమర్శించేవాడు, మత్తులో ఉన్నవాడు అంటే ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవాడు, అటువంటి దుష్ట పండితులు లేదా బ్రాహ్మణులు చేత పూజలు, యాగాలు లేదా శ్రాద్ధ కర్మలను చేయించడం వల్ల సంబంధిత వ్యక్తి నరకానికి వెళ‌తాడు.

కాబట్టి బ్రహ్మణులను ఎంచుకోవడంలో ఇలాంటి తప్పులు చేయకండి. అవును మనకు తెలియకపోవచ్చు..వాళ్లు ఎలాంటి వారో.. పరిచయం ఉన్నవారైతే మనకు వారి ప్రవర్తనను బట్టి ఐడియా వస్తుంది లేదా.. మీ బంధువులు, స్నేహితుల సలహా తీసుకుని వారికి తెలిసిన వారిని పూజకు పిలిపించుకోవచ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news