అయ్యోరామా..చపాతీ కోసం ఇంత డ్రామానా..?

చిన్న వాటికి కూడా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం..చిన్నగా మొదలైన కూడా కొన్ని ప్రాణాలు పొయ్యే వరకు తీసుకొని వస్తాయి.వంట బాగోలేదనో, బట్టలు కొన లేదనో ఇలా చిన్న చిన్నవి పెద్ద గొడవలను తెచ్చి పెడతాయి.ముఖ్యంగా అత్తాకోడల్ల గొడవల గురించి అయితే చెప్పనక్కర్లేదు… నచ్చితే నాకు నువ్వు, నీకు నేను అన్న విధంగా ఉంటారు..ఒకవేళ నచ్చలేదనుకో కయ్యానికి కాలు రువ్వుతారు.ఇప్పుడు అలాంటి ఘటన ఒకటి వెలుగు లోకి వచ్చింది. కోడలు అంటే పడని అత్త చపాతీ కోసం పెద్ద డ్రామాను క్రియేట్ చేసింది..ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరగడంతో కొడుకు ఎంట్రీ ఇచ్చాడు..

 

అతను ఎంత ప్రయత్నించినా కూడా గొడవ సర్దు మనగలేదు.దాంతో భార్యను చావ గోట్టాడు. భర్త చేసిన పనికి పోలీసు స్టేషన్ కు వెళ్ళింది..పోలీసుల ఎంట్రీ తో అత్త జైలుకు వెల్లాల్సి వచ్చింది. వివరాల్లొకి వెళితే.. ఈ కథ మహారాష్ట్ర లో వెలుగు చూసింది.బద్లాపూర్ కు తూర్పున ఉన్న షిర్ గావ్ మౌలీచౌక్ లోని ఓ ఇంటిలో నికుంభ్ కుటుంబం జీవనం సాగిస్తోంది..ఇంట్లో అత్తా కోడలి మధ్య పలుసార్లు వివాదం జరిగింది.మరోసారి గొడవపడితే ఊరుకోనంటూ హెచ్చరించారు.కోడలి పై కక్ష్య గట్టిన అత్త చపాతీలు చేస్తున్న కోడలి దగ్గరకు వెళ్ళి సీన్ క్రియేట్ చేసింది.కోడలి సమాధానంతో అత్తకు కోపంకట్టలు తెంచుకుంది. నన్నే యటకారంగా మాట్లాడతావా అంటూ మండిపడింది. దీంతో వీరి మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరింది.

అశ్విన్ వచ్చి ఇద్దరికి సర్దిచెప్పే ప్రయత్నంచేసినప్పటికీ వారిరువురి మధ్య వివాదం సర్దుమణగలేదు. దీంతో నికుంభ్ భార్యను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వినకపోవటంతో ఆగ్రహంతో కోమల్ ఎడమ చెవిపై రాయితో బలంగా కొట్టాడు. రాయి బలంగా తాకడంతో కర్ణభేరి పగిలిపోయింది.అయిన ఆగని అతను బెల్ట్ తో చావగోట్టారు..అక్కడే ఉంటే చంపెస్తాడని భయపడి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పింది..తల్లి కొడుకులు జైల్లో ఊసలు లెక్కబెడుతున్నారు..