భాగ్య లక్ష్మీ ఆలయాన్ని దర్శించుకుంటే మీకు నమాజ్ గుర్తుకొచ్చిందా..?: బండి సంజయ్

-

భాగ్య లక్ష్మీ ఆలయాన్ని మేము దర్శించుకుంటే మీకు నమాజ్ గుర్తుకు వచ్చిందా..? అని కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ ను ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఓల్డ్ సిటీ, న్యూసిటీగా ఎందుకు మారడం లేదని ప్రశ్నించారు. ఏదో ఒక అంశాన్ని వివాదాస్పదం చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. భాగ్యలక్మీ గుడి తొలిగిస్తాం, చేయివేస్తాం అని అంటున్నారని.. భాగ్య లక్ష్మీ అమ్మవారు మా ఆరాధ్య దైవం అని అన్నారు. మేం చార్మినార్ తొలగించాలని ఎప్పుడూ అనలేదని..చార్మినార్ వద్ద సభ ఏర్పాటు చేసి భాగ్యలక్ష్మీ అమ్మవారిని స్మరించుకున్నాం అని అన్నారు. పాత బస్తీ డెవలప్ కావాలని కోరుకున్నామని అన్నారు. పాత బస్తీ డెవలప్ కాకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఎంఐంఎం పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాస్తుందని అన్నారు. ఓవైసీ తన ఆస్తులను పెంపొందించుకుంటూ.. ముస్లింలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.  ఎంఐఎం కూడా కుటుంబ పార్టీనే అని విమర్శించారు. పాత బస్తీకి ఫ్లైఓవర్లు ఎందుకు రావడం లేదు.. ఓల్డ్ సిటీ హైటెక్ సిటి ఎందుకు కావడం లేదు.. ఓల్డ్ సిటీ ఉగ్రవాదులకు, సంఘవిద్రోహ శక్తులకు అడ్డాగా  ఎందుకు మారిందని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news