హైదరాబాద్ లో దారుణం..ఐరన్ రాడ్డుతో నడిరోడ్డుపై భర్యను కొట్టి చంపిన భర్త

హైదరాబాద్‌ మహా నగరంలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ మహా నగరంలోని… లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశం నగర్ లో అందరూ చూస్తుండగానే రోడ్డుపైన భార్యను చంపాడు ఓ భర్త. మహమ్మద్ యూసుఫ్ కు కరీనా బేగం తో ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

సంవత్సరం నుండి భార్యాభర్తల మధ్య తగాదాలు రావడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. భార్య ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది.
ఈరోజు ఉదయం కాపు కాసి కరీమా బేగం స్కూల్ కి వెళ్తున్న సమయం లో ఐరన్ రాడ్డు తో ఆమెపై రోడ్డుపై దాడి చేసి హతమార్చాడు. స్థానికులు పట్టుకొని నిందితుల్ని పోలీసులకు అప్పగించారు. సదరు మహిళ అక్కడికక్కడే మృతి చెందింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ ను సేకరిస్తున్నారు.