హుస్నాబాద్ లో విషాదం.. తల్లి కాళ్లు, భార్యను నరికిన కిరాతకుడు !

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లి కాళ్లు, భార్యను నరికాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, హుస్నాబాద్ పట్టణంలోని సిక్కులవాడలో గౌరవెల్లి గ్రామానికి చెందిన బదనాపురం రమేష్ (45), శ్వేత (39) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి రచన ఇంటర్మీడియట్, చిన్నమ్మాయి అర్చన ఆరవ తరగతి చదువుతున్నది. బదనాపురం రమేష్ లారీ నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు.

కిరాయి నిమిత్తం 20 రోజులు దూర ప్రాంతం వెళ్లి మూడు రోజుల కింద వచ్చాడు. దీంతో ఆదివారం మీరు కుటుంబ సభ్యులు కలిసి మైసమ్మ పండుగ జరుపుకున్నారు. అర్ధరాత్రి వరకు మద్యం సేవించి నిద్రించారు. హఠాత్తుగా తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో మేల్కొన్న రమేష్ అందరూ నిద్రిస్తున్న వేళ కమ్మ కత్తితో భార్య శ్వేత చేయిని, తల్లి పోచమ్మ రెండు కాళ్ళను నరికాడు. అనుకోని హఠాత్పరిణామానికి గురైన శ్వేత కేకలు వేస్తూ బయటకి పరిగెత్తింది. దాహం దాహం అంటూ తల్లడిల్లి బకెట్లో ఉన్న నీళ్లను తాగింది. వెంటనే పెద్దమ్మాయి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం పోలీసులకు చెప్పడంతో, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.