దేవుడా.. పెళ్లికి తీసుకెళ్లలేదని 8 ఏళ్ల బాలిక ఆత్మహత్య..!

-

సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో ప్రాణాలు తీయడానికి, తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. చిన్న చిన్న కారణాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అసలు మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. దీంతో రోజురోజుకి సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తెలిసి తెలియని వయస్సులోనే చిన్న పిల్లలు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

suicide
suicide

సాధారణంగా పెళ్లిళ్లకి వెళ్తున్నప్పు‍ుడు పిల్లలు వెంటపడటం సహజం. పిల్లల్ని కొంచెం మందలించి ఇంటి దగ్గరే ఉంచి వెళ్తారు. కానీ, ఉత్తర ప్రదేశ్ లో పెళ్లికి తీసుకెళ్లలేదని 8 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుందంటే నమ్ముతారా.. ఇలాంటి దారుణ ఘటనే ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని నిర్ధాణ గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లికి వెళ్తున్న తల్లి వద్దన్నందుకు ఆ బాలిక ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ఎస్‌హెచ్‌వో ధర్మేంద్ర సింగ్‌ తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే పత్వి గ్రామంలో జరిగిన పెళ్లికి బాలిక కుటుంబ సభ్యులు బయలుదేరి వెళ్లి వచ్చారు. వారు తిరిగి వచ్చేసరికి తమ ఇంట్లోని చిన్నారి విగత జీవిగా వెలాడుతుంది. తనని పెళ్లి తీసుకెళ్లాలని తల్లిని కోరినప్పటికీ తీసుకు వెళ్ల లేదని.. తనను కాకుండా సోదరుడిని తీసుకెళ్లినందుకు ఎనిమిదేళ్ల బాలిక మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడిందాని కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు వివరించారు. దీనిపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికే ఊరి వేసుకుందా.. లేక ఇంకేమైనా జరిగి ఉంటుందా అనే కోణాల్లో విచారణ చేపట్టామని తెలిపారు. తాము సంఘటనా స్థలానికి చేరుకునే లోపు ఆ బాలికకు అంత్యక్రియలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కాలం పిల్లల్ని కాస్త జాగ్రత్తగా గమనించుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news