భార్యను మేకప్‌ లేకుండా మొదటిసారి చూసి షాకైన భర్త.. తన వల్ల కావట్లేదని ఏం చేశాడంటే..!

-

ప్రేమ గుడ్డిది అంటుంటారు. ఈ జంట విషయంలో మొదట నిజమే నేమో అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మనకు పెద్దగా చెప్పనక్కర్లేదు..సోషనల్ మీడియా ప్రేమలు ఎంత త్వరగా ఏర్పడాతయో..అంతే త్వరగా బ్రేకప్ అవుతాయి. కానీ వాటన్నింటికి రీజన్ అర్థంచేసుకోకపోవటమో, మరి ఇంకేదో బలమైన కారణాలు ఉండొచ్చు కానీ, ఈ కేసులో మాత్రం భార్య మేకప్ లేకుండా బాలేదని ఆ భర్త కోర్టునే ఆశ్రయించాడు. అసలు వీళ్ల ప్రేమకథ ఎలా మొదలైందో..మొఖం చూసుకోకుండా మరీ పెళ్లివరకూ ఎలా వచ్చారో చూద్దాం.

రిపోర్టుల ప్రకారం ఆ ఈజిప్ట్ యువకుడు ఓ యువతితో ఫేస్‌బుక్‌లో ప్రేమాయణం నడిపాడు. బేసిక్ గా అమ్మాయిలు తమ అందమైన ఫొటోలనే సోషల్ మీడియాలో పెడుతుంటారు కదా… ఆమె కూడా అలాగే చేసింది. అవి చూసి ఆమెను ప్రేమించాడా యువకుడు. ఆ తర్వాత ఇద్దరూ 2-3 సార్లు బయట కలిశారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కూడా. పెళ్లి అయితే ఘనంగానే జరిగింది. మర్నాడే మొదలైంది అసలు సమస్య. మొదటిసారి ఆమెను మేకప్ లేకుండా చూసి ఈమె అసలు తన భార్య కాదనుకున్నాడు. ఈ విషయం చాలా కామెడిగా అనిపిస్తుండొచ్చు మనకు. కానీ పాపం ఆ భర్త ఏ లెవల్ లో షాక్ అయ్యాడంటే..పెళ్లిబంధం కూడా వద్దనుకున్నాడు.

విడాకులు తీసుకోవాలనుకున్నాడు కూడా ఆ భర్త. వీరి వివాదం హెలీపోలీస్ ఫ్యామిలీ కోర్టుకు చేరింది. నా భార్యను పెళ్లి తర్వాత మేకప్ లేకుండా చూసి షాక్ అయ్యాను అని కోర్టుకు తెలిపాడు భర్త. ఆమె ఫేస్ బుక్ ఫొటోల్లో పూర్తి భిన్నంగా ఉందనీ… మేకప్ లేకపోతే… గుర్తుపట్టలేని విధంగా ఉందని చెప్పుకొచ్చాడు. మేకప్ వేసుకొని తనను మోసం చేసిందని మండిపడ్డాడు. తనకు విడాకులు ఇవ్వాలని కోరాడు.

“ఆమె నా కళ్లను మోసం చేసింది. పెళ్లికి ముందు విపరీతంగా మేకప్ వేసుకొని ఫొటోలు దిగింది. ఆమె అసలైన ఫేస్ ఇప్పుడు చూశాను. మేకప్ లేకపోతే ఆమె అంద విహీనంగా ఉంది. కాబట్టి నాకు విడాకులు కావాలి” అని ఆ భర్త కోర్టులో కోరాడు.

కోర్టు వాళ్లిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చింది. ఆమెతో ఏడాది పాటూ ఉండి.. సర్దుకుపోవడానికి ప్రయత్నించమని చెప్పింది. అలా కుదరకపోతే అప్పుడు విడాకుల కోసం రమ్మంది. కానీ ఆ భర్త మనసు మారలేదు. ఏడాది లోపే మళ్లీ కోర్టుకు వచ్చి విడాకులు కోరాడు. తన వల్ల కావట్లేదని..తెల్లారి నిద్ర లేచాక ఆమె ఫేస్ చూస్తే…చింపిరి జుట్టుతో చూడలేక పోతున్నానని తెలిపాడు. ఆమె ఆమెలాగా అస్సలు లేదనీ… తనకు విడాకులు ఇవ్వాల్సిందేనని కోరాడు. అయితే దీనిపై కోర్టు త్వరలో తీర్పు చెప్పనుంది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news