కూతురుపై లైంగిక దాడి చేసిన తండ్రికి మరణించే వరకు జైలు

-

కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి మరణించే వరకు కారాగార శిక్ష విధిస్తూ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి ఫిలింనగర్ లో నివసిస్తోంది.

భర్త కాపలాదారుగా పనిచేస్తుండగా, భార్య స్థానికంగా ఇళ్లలో పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. వీరికి 14 ఏళ్ల కుమార్తె, ఓ కుమారుడు సంతానం. కుమారుడు తూర్పుగోదావరి జిల్లాలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటుండగా, కుమార్తె తల్లిదండ్రులతో పాటు ఉండేది. 2021 జులైలో ఆమె వాంతులు చేసుకోవడంతో తల్లి నాంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. పరీక్షించిన వైద్యులు ఆమె నాలుగు నెలల గర్భిణీ అని తేల్చారు. ఈ విషయమై ఆమెను ప్రశ్నించగా, తల్లి పనికి వెళ్ళిన సమయంలో తండ్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి నిద్రపోయాక లైంగిక దాడికి పాల్పడేవాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని తల్లికి వివరించింది. అయితే ఈ కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news