ప్రేమికుల చివరి సెల్ఫీ.. తర్వాత ప్రాణమే తీసుకున్నారు..!

-

ఎలాగూ కలిసి బతకలేకపోతున్నాం.. కలిసి చనిపోదాం అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి ఇద్దరూ తమ వెంట తెచ్చుకున్న బీర్లు తాగారు. తమ దగ్గర ఉన్న పిస్తోళ్లను తమ తలకు గురి పెట్టుకొని ఆఖరి సెల్ఫీ దిగి.. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి తమను తాము కాల్చుకొని చనిపోయారు.

ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. కానీ.. వాళ్ల ప్రేమను పెద్దలు అర్థం చేసుకోలేదు. దీంతో కలిసే ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద ఘటన రాజస్థాన్ లోని లిలాసర్ లో చోటు చేసుకున్నది.

బన్వర్ లాల్.. అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. చాలా రోజుల నుంచి వాళ్ల మధ్య ప్రేమాయణం నడుస్తోంది. అయితే.. వీళ్ల ప్రేమ గురించి ఇంట్లో తెలియడంతో పెద్దలు వాళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు. రెండు నెలల కింద ఆ యువతికి వేరే వ్యక్తితో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అయితే… బన్వర్ లాల్ తో ప్రేమలో ఉన్న ఆ యువతి పది రోజుల కింద భర్తను వదిలేసి బన్వర్ లాల్ వద్దకు వచ్చింది.

ఎలాగూ కలిసి బతకలేకపోతున్నాం.. కలిసి చనిపోదాం అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి ఇద్దరూ తమ వెంట తెచ్చుకున్న బీర్లు తాగారు. తమ దగ్గర ఉన్న పిస్తోళ్లను తమ తలకు గురి పెట్టుకొని ఆఖరి సెల్ఫీ దిగి.. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి తమను తాము కాల్చుకొని చనిపోయారు.

ఉదయం వాళ్లను గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని పోస్ట్ మార్టంకు తరలించారు. ప్రేమ విఫలం కావడం వల్లే ఆ జంట ఆత్మహత్యకు పాల్పడిందని కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news