12 ఏళ్ల బాలుడు,17 ఏళ్ల బాలికపై అత్యాచారం… గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనిచ్చిన బాలిక

-

తమిళనాడులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.  12 ఏళ్ల బాలుడు ఓ బిడ్డకు తండ్రయ్యాడు. 17 బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో సదరు బాలిక గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన తమిళనాడు తంజావూరులో చోటు చేసుకుంది. ఈ ఘటనకు కారమైన బాలున్ని పోలీసులు అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి, జువైనల్ హోంకు తరలించారు. ఇటీవల సదరు బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు బాలికను పరీక్షించి 9 నెలల గర్భిణిగా తేల్చారు. బాలిక అదే రోజు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బాలిక, బాలుడు ఒకే ప్రాంతానికి చెందిన వారు. 

ఈ ఘటనపై పోలీస్ విచారణ చేపట్టగా…. బాలిక, 12 ఏళ్ల బాలుడు కారణం అని తెలిపింది. అయితే పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం సెక్షన్ 5 (1) మరియు 5 (j) (ii) సెక్షన్ 6 కింద అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనకు మరెవరైనా కారణమై ఉండవచ్చనే అనుమానంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. శాస్త్రీయ పద్దతులు మరియు డీఎన్ఏ పరీక్షద్వారా బాలుడి వయసు నిర్థారించాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా బాలిక గర్భం దాల్చి బిడ్డను కనేవరకు ఈ విషయాన్ని తల్లిదండ్రులతో వెల్లడించలేదని పోలీసులు వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news