నిజామాబాద్ లో ఉగ్ర లింకులపై NIA ప్రత్యేక నిఘా

-

నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాద లింకులు కలకలం రేపుతున్నాయి. ఉగ్రవాద ముసుగులో యువతకు కరాటే నేర్పించిన విషయంలో ఇంకా విచారణ కొనసాగుతూ ఉండగానే ఆర్మూరులో ఐసిస్ ఉగ్రవాద లింకులు వెలుగు చూడటం ఆందోళనకు గురిచేస్తుంది. ఆర్మూర్ జీరాయత్ నగర్ కు చెందిన షేక్ నవీద్ కు ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని భావించిన ఎన్ఐఎ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆర్మూర్ కి చెందిన షేక్ నవీద్ వ్యవహారాలపై ఎన్ఐఎ విచారణ వేగవంతం చేసింది. నవీద్ పాస్ పోర్ట్, బ్యాంకు ఖాతాలు, సెల్ ఫోన్లు సీజ్ చేసింది ఎన్ఐఏ. ఆగస్టు 12న షేక్ నవీద్ విచారణకు హాజరుకావాలని ఎన్ఐఎ నోటీసులు జారీ చేసింది. షేక్ నవీద్ అకౌంటులలోకి విదేశాల నుంచి వచ్చిన డబ్బు ఎటు వెళ్లింది అనే కోణంలో విచారణ చేపడుతుంది ఎన్ఐఎ. అతడికి విదేశాల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ పై కూడా ఆరా తీస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news