ఎడిట్ నోట్: ‘లిస్ట్’ పాలిటిక్స్!

-

ఇప్పుడు తెలంగాణలో బీజేపీలో చేరే నేతల లిస్ట్ పై పెద్ద చర్చే నడుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో బలపడి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి..వలసలే ప్రధాన అవుతాయని ఈ మధ్య వచ్చిన సర్వేల్లో తేలింది. వేరే పార్టీల నుంచి వచ్చిన నేతల వల్లే పార్టీకి బలపడే అవకాశాలు ఉన్నాయని, అలాగే అన్నీ నియోజకవర్గాల్లో బలమైన నాయకులు ఉంటే…బీజేపీకి విజయం సులువుగా దక్కుతుందని తెలిసింది. అంటే జంపింగులే బీజేపీకి బలం అని క్లారిటీ వచ్చేసింది.

అందుకే ఇతర పార్టీల్లోని నేతల్ని ఆకర్షించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది…పైగా ఈటల రాజేందర్ ని చేరికల కమిటీ కన్వీనర్ గా పెట్టారు..ఈ కమిటీలో డీకే అరుణ సైతం కీలక సభ్యురాలుగా ఉన్నారు. అయితే ఈటలకు…టీఆర్ఎస్ నేతలతో ఎన్నో ఏళ్ల నుంచి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి…ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలతో అరుణ టచ్ లో ఉంటున్నారు. ఇలా ఇద్దరు కలిసి…టీఆర్ఎస్-బీజేపీలకు చెందిన బడా నేతలని బీజేపీలోకి కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పటికే వారు పలువురు నేతలతో టచ్ లోకి వెళ్లారని తెలిసింది..ఇక బీజేపీలోకి వచ్చే నేతల లిస్ట్ పట్టుకుని ఈటల, అరుణ…ఢిల్లీకి వెళ్లారు. అక్కడ అధిష్టానానికి లిస్ట్ ఇచ్చి…వారిలో ఇంకా మెరుగైన నేతలని బీజేపీలో చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది.

అయితే ఈటల ఇచ్చిన లిస్ట్ లో చాలామంది నేతల పేర్లు బయటకొస్తున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైంది. అలాగే వరంగల్ జిల్లాకు చెందిన రాజయ్య యాదవ్, అలాగే మహబూబ్ నగర్ లో పలువురు బడా నేతలు…బీజేపీ లిస్ట్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మాజీ ఎంపీ, మాజీ మంత్రి పేర్లు కూడా ఉన్నాయని సమాచారం. వారు ఎవరో కాదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అని ప్రచారం జరుగుతుంది.

ఇక మెదక్ కు చెందిన ఒక ఎంపీ, కరీంనగర్ కు చెందిన ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారని టాక్. అయితే ఇక్కడ టీఆర్ఎస్ లో ఉన్న బడా నేతల కంటే ద్వితీయ శ్రేణి నేతలని పార్టీలో చేర్చుకుంటే బెటర్ అని బీజేపీ అధిష్టానం భావిస్తుందట. ఇప్పటివరకు అధికారం అనుభవించిన నేతలు..ఇప్పుడు బీజేపీలోకి వస్తే వ్యతిరేకత పెరుగుతుందని, అదే ద్వితీయ శ్రేణి నేతలైతే ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి వలసలు ఎక్కువగా ఉంటాయని ఈటల, అరుణ…అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. మొత్తానికైతే బీజేపీ లిస్ట్ పెద్దగానే ఉంది…మరి ఆ లిస్ట్ లో ఉన్నట్లు నేతలు బీజేపీలోకి వస్తారో లేదో చూడాలి. ఏదేమైనా ఇప్పుడు బీజేపీ లిస్ట్ చుట్టూనే రాజకీయం తిరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news