VBIT కాలేజీ ఘటనలో నిందితులను పట్టుకున్న పోలీసులు

-

విబిఐటి కాలేజ్ మార్ఫింగ్ ఫోటోల ఘటన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలోని నిందితులను పట్టుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా రాచకొండ సిపి డిఎస్ చౌహన్ మాట్లాడుతూ.. VBIT కాలేజీ ఘటన లో నలుగురు నిందితులను పట్టుకున్నామని తెలిపారు. ఆంద్రప్రదేశ్ స్టేట్ లో నిందితులను అదుపు లోకి తీసుకున్నామన్నారు.

ఇందులో నలుగురు నిందితులు 2 నెలల నుండి విజయవాడ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న E3 ఫుడ్ కోర్ట్ పని చేస్తున్నారని తెలిపారు. పట్టుకున్న వారిలో లక్ష్మీ గణపతి(19), ప్రదీప్(19), సతీష్(20), దుర్గ ప్రసాద్(19) ను అరెస్ట్ చేసామన్నారు. ఓ ఇంజనీరింగ్ కాలేజి హాస్టల్ లో నుండి ఒక కంప్లైంట్ వచ్చిందని.. కొందరు సైబర్ నేరాగాళ్ళు విద్యార్థినులను వేధింపులు గురి చేశారని తెలిపారు. ఒక విద్యార్థిని నెంబర్ తీసుకొని ఆమె వద్ద నుండి మిగతా వాళ్ళ నెంబర్లు తీసుకొని.. ఇంస్టాగ్రామ్ లో, వాట్స్ ఆప్ లో న్యూడ్ ఫొటోస్ పెట్టి భయాందోళనకు గురి చేశారని తెలిపారు.

వారి ఫిర్యాదు తో Sot, షి టీమ్స్ రంగంలో దిగారని.. నార్మల్ చాట్ చేసిన తరువాత ఇన్స్టగ్రామ్ లో కాల్స్ చేయడం, వాట్స్ అప్ లో మెసేజెస్ చేసి ఫొటోస్ పెట్టేవారని తెలిపారు. కింగ్ is బ్యాక్ తో హ్యాకింగ్ స్కాం, ఎంటర్ ది డ్రాగన్, XXX తేజ రౌడీ గ్రూప్ లను క్రియేట్ చేసి బెదిరింపులు పాల్పడ్డారని తెలిపారు సిపి. నిందితుల పై 354(D), 509,469ipc, sec-67,67(A) సెక్షన్స్ తో పాటు ఐటీ యాక్ట్ నమోదు చేసామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news