కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడంతో వైసీపీ ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించారు. ఈ జీవో వచ్చిన వెంటనే రాజమండ్రిలో జగన్ రోడ్ షో జరిగింది..అటు ఎక్కడో చోట వైసీపీ నేతలు రోడ్లపై ర్యాలీలు చేస్తూనే ఉన్నారు. కానీ కుప్పంలో చంద్రబాబుకు పర్మిషన్ ఇవ్వలేదు..దీంతో ఆయన పాదయాత్రతోనే నియోజకవర్గంలో పర్యటించారు.
ఈ జీవో వల్ల అటు బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లపై ఆంక్షలు పెట్టారు. ఆంక్షల నడుమ ఫంక్షన్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 12న శ్రీకాకుళంలోని రణస్థలంలో యువశక్తి పేరిట ఓ భారీ సభ నిర్వహించడానికి జనసేన సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లని నాదెండ్ల మనోహర్ పరిశీలిస్తున్నారు. అయితే ఈ సభకు ఇంకా పోలీసులు పర్మిషన్ కనిపించడం లేదు. దీంతో పవన్ సభని ఎలా ఆపుతారో చూస్తామని జనసేన నేతలు సవాల్ చేస్తున్నారు.
అయితే సభకు కొన్ని ఆంక్షలతో పర్మిషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదైనా ఖాళీ ప్రదేశంలో..ఓ లిమిట్ వరకు ప్రజలు వచ్చేలా సభ నిర్వహించుకునేందుకు పర్మిషన్ ఇవ్వవచ్చు. కానీ పవన్ వస్తున్నారంటే వేలాది మంది వస్తారు..అలా వస్తే సభకు బ్రేకులు వేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఏమో ఎట్టి పరిస్తితుల్లోనూ సభ నిర్వహిస్తామని జనసేన నేతలు అంటున్నారు.
పోలీసుల ఆంక్షల మేరకు సభకు నిర్వహిస్తామంటే పర్మిషన్ దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చూడాలి మరి చివరికి పవన్ సభ ఏ స్థాయిలో జరుగుతుందో.