కేసీఆర్ బిగ్ ప్లాన్…ఏపీలో 20 సీట్లలో పోటీ?

-

ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించే దిశగా వెళుతున్న కేసీఆర్..అక్కడ వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నారు. నిదానంగా పార్టీని విస్తరించే క్రమంలో కీలక నేతలని పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నాయకులని చేర్చుకున్నారు. ఇదే క్రమంలో తోట చంద్రశేఖర్‌కు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇంకా అక్కడ కొందరు కీలక నేతలని చేర్చుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. అయితే అక్కడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. ఇదే క్రమంలో కాపు ఓట్లు, అమరావతికి అనుకూలంగా ఉన్నవారి ఓట్లనే లక్ష్యంగా చేసుకున్నారు.

అంటే ఈ ఓట్లు అంటే డౌట్ లేకుండా టీడీపీ-జనసేనలకు నష్టం జరగడమే అని చెప్పవచ్చు. ఆ ఓట్లు చీలితే ఆటోమేటిక్‌గా వైసీపీకి లాభం జరుగుతుంది. ఇదే క్రమంలో కేసీఆర్…వచ్చే ఎన్నికల్లో కీలక స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అది కూడా తెలంగాణకు బోర్డర్‌గా ఉన్న జిల్లాల్లో పోటీ చేయాలని చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలు అయిన..పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పోటీకి దిగాలని చూస్తున్నారట. మొత్తం 20 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట.

ఇక ఆయా జిల్లాల్లో టీడీపీ-జనసేన ప్రభావం ఉంటుంది..ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ వల్ల..ఆ రెండు పార్టీలకే నష్టం జరిగేలా స్కెచ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఉదాహరణకు కృష్ణాలో…నందిగామ,జగ్గయ్యపేట స్థానాల్లో పోటీ చేయాలని చూస్తున్నారు..ఈ రెండు స్థానాలు తెలంగాణలో అటు ఖమ్మం, ఇటు నల్గొండ జిల్లాలకు బోర్డర్‌లో ఉంటాయి. ఇలా బోర్డర్ లో ఉంటే స్థానాల్లో పోటీకి దిగాలని చూస్తున్నారు.

అలాగే బాపట్ల, గుంటూరు, విశాఖ ఎంపీ సీట్లలో పోటీకి దిగాలని భావిస్తున్నారట. అంటే ఇవి టీడీపీకి పట్టున్న స్థానాలే. మొత్తానికి కేసీఆర్ స్కెచ్ మాత్రం టీడీపీ-జనసేనలని దెబ్బతీసేలా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏపీలో కేసీఆర్ ప్రభావం ఎంత ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news