అందుకే వాళ్లను చంపేశా.. సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో కూడా శ్రీనివాస్ రెడ్డి.. పోలీసులకు సహకరించాడట. ఏది పెడితే అది తిని.. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడట. ఇప్పటి వరకు పోలీసులు గుర్తించిన హత్యలకు సంబంధించి మాత్రమే శ్రీనివాస్ రెడ్డి చెప్పాడట.

హాజీపూర్ వరుస హత్యల గురించి మీకు తెలిసిందే కదా. సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి అత్యంత కిరాతకంగా ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి మరీ హత్య చేసి బావిలో పడేశాడు. కర్నూల్ లోనూ ఓ యువతిని చంపేశాడు. శ్రీనివాస్ రెడ్డి ఇంకెంత మందిని బలి తీసుకున్నాడో అని అంతా భయపడుతున్న తరుణంలో పోలీస్ విచారణలో సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నాకు వాళ్లను చూస్తే అప్పుడు అలా చేయాలనిపించింది.. అందుకే వాళ్లను అత్యాచారం చేసి చంపేశా.. అని శ్రీనివాస్ రెడ్డి.. పోలీసుల విచారణలో సంచలన వ్యాఖ్యలు చేశాడట. గత కొన్నిరోజుల నుంచి శ్రీనివాస్ రెడ్డి పోలీసుల కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. నిందితుడి కస్టడీ సోమవారంతోనే ముగిసింది. దీంతో అతడిని నల్గొండ కోర్టులో హాజరు పరిచి.. తర్వత వరంగల్ జైలుకు తరలించారు.

పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో కూడా శ్రీనివాస్ రెడ్డి.. పోలీసులకు సహకరించాడట. ఏది పెడితే అది తిని.. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడట. ఇప్పటి వరకు పోలీసులు గుర్తించిన హత్యలకు సంబంధించి మాత్రమే శ్రీనివాస్ రెడ్డి చెప్పాడట. ఇంకా శ్రీనివాస్ రెడ్డి ఎవరినైనా ఇలాగే హత్య చేశాడా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.

600 మంది అమ్మాయిలతో ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ పైనా పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు. వాళ్లెవరో నాకు తెలియదు. ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించా.. వాళ్లు యాక్సెప్ట్ చేశారు. అంతే.. తప్పించి వాళ్ల గురించి నాకు ఏ విషయాలు తెలియదని శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. వాళ్లతో తనకు ఎటువంటి సంబంధాలు లేవని.. వాళ్లతో ఇప్పటి వరకు తాను చాటింగ్ కూడా చేయలేదని శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు తెలిపాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version