ఇంటర్నెట్ లో వెతికి.. అప్సరను హత్య చేసిన పూజారి

-

శంషాబాద్ లో సంచలనం రేపిన అప్సర హత్య రిమాండ్ రిపోర్టులో కలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుండి సాయి కృష్ణ, అప్సర మధ్య పరిచయం ఏర్పడింది. బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. తరచూ అప్సరకు వాట్స్అప్ ద్వారా మెసేజెస్ చేశాడు సాయి కృష్ణ.

నవంబర్లో గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని సందర్శించారు సాయి కృష్ణ , అప్సర. నవంబర్లో గుజరాత్ వెళ్లిన తర్వాత వీరి మధ్య బంధం మరింత బలపడింది. వాట్సాప్ ద్వారా లవ్ ప్రపోజ్ చేసింది అప్సర. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. తనను పెళ్లి చేసుకోకపోతే సాయి కృష్ణను రోడ్డుకు ఈడుస్తానని బ్లాక్ మెయిల్ చేసింది అప్సర.

దీంతో ఆమెను అడ్డు తొలగించుకునేందుకే హత్య చేశాడు సాయి కృష్ణ. హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో శోధించాడు సాయి కృష్ణ. “How to Kil human being” అని టైప్ చేసి గూగుల్లో వెతికాడు. తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని పలుమార్లు సాయి కృష్ణను కోరింది అప్సర. అదే సాకుతో ఆమెను శంషాబాద్ తీసుకువెళ్లి నిద్రిస్తూ ఉండగా హత్య చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version