MASTER KIDNAP: 19 మంది బాల కార్మికులను కాపాడిన పోలీసులు!

-

లోకం ఎలా అయిపోయింది అంటే ఏమైనా చేసి డబ్బు సంపాదించాలి అంతే.. అందుకోసం మానవత్వాన్ని మరిచిపోతున్నారు, అనైతికంగా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అన్యాయంగా అభం శుభం తెలియని 19 మంది బాలురను అపహరించి వేరే రాష్ట్రానికి తరలించడానికి ఒక 10 మంది నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం వేరే రాష్ట్రాలకు పంపించడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ అబ్బాయిలను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పట్టాలపై సిద్ధంగా ఉన్న దానాపూర్ ఎక్స్ప్రెస్ లో తరలించడానికి చూశారు. కానీ నిందితులు మరియు పిల్లలను చూసిన పోలీసులు అనుమానంతో వారిని పట్టుకున్నారు. గట్టిగా రెండు తగిలించగా నిందితులు అసలు విషయం బయటపెట్టారు. ఈ పిల్లలను వేరే రాష్ట్రాలకు తరలించి అక్కడ పరిశ్రమలలో పని చేయిస్తామన్నారు. సమయానికి పోలీసులు చూడడంతో వారి భవిష్యత్తు అన్యాయం కాకుండా కాపాడారు.

ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకుంటున్న పోలీస్ శాఖ దీని వెనుక ఇంకెవరు ఉన్నారు. అసలు ఎలా బాలురను కిడ్నప్ చేస్తారు అన్న పూర్తి వివరాలకు కనుగునే ప్రయత్నంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news