గంటలో రూ. 564 కోట్లు నష్టపోయిన బ్రిటన్‌ ప్రధాని భార్య

-

కోటి రూపాయలు సంపాదన ఒకరి జీవితం మొత్తంతో సమానం. లైఫ్‌ అంత కష్టపడినా అంత సంపాదించలేం అనుకునేవాళ్లు ఏంతో మంది. అలాంటిది ఒక గంటలో ఏకంగా 564 కోట్లు కోల్పోయింది బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ భార్య. ఎంత డబ్బు ఉన్నవాళ్లైకానా ఇంత ఘోరంగా లాస్‌ వస్తే అది పెద్ద విషయమే అవుతుంది కదా.! అసలేమైంది.. ఇంత సంపదను ఎందుకు ఎలా కోల్పోయారు..?

ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ గురువారం రోజు 2023-24 ఆర్థిక సంవత్సరం తన తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 11 శాతం పెరిగి రూ. 5945 కోట్లుగా నమోదైంది. ఆదాయం కూడా స్వల్పంగా పెరిగింది. కానీ రెండు పెరిగినప్పటికీ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. మార్చి త్రైమాసికంతో పోలిస్తే కూడా ఇది తక్కువే. దీంతో ఇన్ఫోసిస్ షేరు ఘోరంగా పడిపోయింది. శుక్రవారం సెషన్‌లో ఇన్ఫోసిస్ షేరు ఒక దశలో 10 శాతానికి పైగా (షేరుకు రూ.145 నష్టం) పతనమైంది. ప్రస్తుతం 8 శాతానికిపైగా నష్టంతో రూ. 1330 లెవెల్స్‌లో ట్రేడవుతోంది. షేరుపై రూ.120 కోల్పోయింది. స్టాక్ మార్కెట్లు కూడా ఐటీ దిగ్గజ కంపెనీల బలహీన ఆదాయాల నడుమ భారీ పతనం దిశగా నడుస్తున్నాయి.

ఇన్ఫోసిస్ షేర్లు పతనం కావడంతో అందులో పెట్టుబడి పెట్టినవారి సంపద భారీగా పతనమైంది. ఇందులో ముందుగా మాట్లాడుకోవాల్సింది బ్రిటన్ పీఎం రిషి సునాక్ సతీమణి ఇన్ఫీ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి గురించి. 2023 జనవరి – మార్చి త్రైమాసికం వరకు చూస్తే ఈమెకు ఇన్ఫోసిస్ కంపెనీలో సుమారు 1.07 శాతం వాటా (ఏకంగా 3,89,57,096) ఉంది. ఇక షేరు విలువ ఇవాళ గంటలోనే 10 శాతానికిపైగా అంటే షేరుపై రూ.145 పతనం కాగా.. ఈమె సంపద కోట్ల మేర పడిపోయింది. 3,89,57,096 X 145 = 5,64,87,78,920 అంటే ఏకంగా రూ. 564 కోట్ల సంపద కరిగిపోయింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్థిర కరెన్సీ వద్ద ఆదాయ అంచనాలను కూడా తగ్గించింది ఇన్ఫోసిస్. ఇది 4.7 శాతం నుంచి ఏకంగా 1- 3.5 శాతానికి తగ్గించడం గమనార్హం. ప్రాజెక్ట్ నిర్ణయాలు ఆలస్యం అవ్వొచ్చన్న అంచనాలే ఇందుకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news