సుమ‌ల‌త‌కు అమ్మాయిలంటే మ‌హా పిచ్చి… షాకింగ్ నిజాలు

482

ప్ర‌పంచంలో రోజు రోజుకు కొత్త వింత పోక‌డ‌లు వెలుగు చూస్తున్నాయి. మ‌నుష్యుల విప‌రీత ప్ర‌వ‌ర్త‌న‌తో వాళ్లు ఏం చేస్తున్నారో ?  కూడా అర్థంకాని ప‌రిస్థితి. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూడని సరికొత్త సంఘ‌ట‌న ఒంగోలులో చోటు చేసుకుంది. ఒంగోలులో ఒక భర్త పెంట్ హౌస్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని పోలీసులు ఛేదించారు. ఈ సంఘ‌ట‌న‌లో షాక్ అయ్యే నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ సంఘ‌ట‌న‌కు ఆత్మ‌హ‌త్య చేసుకున్న వ్య‌క్తి భార్య సుమలత అలియాస్ సాయితేజా రెడ్డి గురించి క‌ళ్లు బైర్లు క‌మ్మే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి.

అస‌లు విష‌యంలోకి వెళితే సుమ‌ల‌త‌ ఒక బాలికను తన మాటలతో మాయ చేయటమే కాదు.. ట్రాప్ చేసి ఇంటికి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు నరకం చూపించిన వైనం పోలీసుల వరకూ వెళ్లింది. చివ‌ర‌కు ఆ బాలిక ఇంటికి వెళ్లిన‌ప్పుడు దుస్తులు చిరిగిపోయి నీర‌సంగా ఉండ‌డంతో విచారించ‌గా ఆ బాలిక షాకింగ్ విష‌యాలు చెప్పింది. చివ‌ర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో రంగంలోకి దిగిన పోలీసులు సుమలత ఇంటిని తనిఖీ చేయటంతో షాక్ తిన్నారు.

తమ గుట్టు రట్టు కావటంతో అవమానభారంతో సుమలత భర్త (సహజీవనం చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు) ఏడుకొండలు మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మ‌రి సుమ‌లత అంత‌లా ఏం చేస్తుంది ?  ఆమె చేసిన ప‌ని ఏంటి ?  దీనిని ఆమె భ‌ర్త ఎందుకు అవ‌మానంగా భావించాడు ? అన్న‌ది చూస్తే షాక్ అవ్వాల్సిందే. ప్ర‌కాశం జిల్లా కొండ‌పి మండ‌లం జాళ్లపాలెంకు చెందిన సుమ‌ల‌త భ‌ర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటోంది.

ఆమె, భార్యతో విడాకులు తీసుకున్న ఏడుకొండలుతో ఏడేళ్ల నుంచి సహజీవనం చేస్తుందని కొంద‌రు అంటున్నారు. ఆమెకు సిమ్ కార్డులు ఇచ్చే వంశీ ప‌రిచ‌యం అయ్యాడు. అత‌డు యువతుల ఫోన్ నెంబ‌ర్లు ఆమెకు ఇచ్చేవాడు. సుమ‌ల‌త ఆ యువ‌తుల‌తో తాను సాయితేజా రెడ్డి పేరుతో మాట్లాడేది. వారిని ట్రాప్ చేసేది. ఆ త‌ర్వాత ఎవ‌రైనా ఆమె మాయ‌లో ప‌డితే వారిపై అత్యాచారం కూడా చేసేది. పూర్తిగా అస‌హ‌జ లైంగిక పద్ధతులకు ఆమె అల‌వాటు ప‌డింది. ఆమె దుర్మార్గాలకు భర్త ఏడుకొండలు పూర్తిగా సహకరించేవాడు.

తాజాగా బాధితురాలైన ఓ బాలిక వీరి గుట్టు ర‌ట్టు చేసింది. వీరింట్లో పోలీసులు త‌నిఖీ చేయ‌గా సెక్స్ టాయిస్ తో పాటు.. కొన్ని ఆధారాలు లభించాయి. ఇదే సమయంలో తమ గుట్టు మొత్తం పోలీసులకు తెలిసిపోయిందన్న భయంతో ఏడుకొండలు ఆత్మహత్య చేసుకోగా.. సుమలత.. వంశీలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.