బ్రేకింగ్‌: గాంధీ కుటుంబానికి మోదీ తాజా షాక్‌

-

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ గాంధీ అన్న ముద్ర భ‌విష్య‌త్తులో ఎప్ప‌ట‌కీ దేశం మీద ఉండ‌కూడ‌ద‌న్న టార్గెట్‌తోనూ అనేక నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ప్ర‌తిసారి గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఏ ప‌టేల్‌నో లేదా మ‌రో నేత‌నో చ‌ర్చించే మోదీ ఇప్పుడు గాంధీ కుటుంబానికి మ‌రో షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కుటుంబానికి ఎస్‌పీజీ (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్) రక్షణను ఉపసంహరించాలని కేంద్రం తాజాగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం గాంధీ కుటుంబంలో సోనియా, రాహుల్‌, ప్రియాంక కుటుంబాల‌కు ఎస్‌పీజీ భద్రత ఉండ‌గా కేంద్రం దీనిని ఉపసంహరించి, జడ్ ప్లస్ కేటిగిరి భద్రత కల్పించనున్నట్టు ప్రభుత్వ వర్గాల తాజా సమాచారం. ప్రధాని, రాష్ట్రపతికి మాత్రమే ఎస్‌పీజీ భద్రత ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఎస్‌పీజీ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. కాగా, గాంధీ కుటుంబానికి ఎస్‌పీజీ భద్రత ఉపసంహరణ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news