క్రికెట్‌ ఆడుతూ కుప్పకూలిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

క్రికెట్‌ ఆడుతూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. గుజరాత్‌కు చెందిన తుస్సార్‌ అనే వ్యక్తి నగరంలోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు.

బుధవారం రాజేంద్రనగర్‌ పరిధిలోని సన్‌సిటీ ఎస్‌బీఐ గ్రౌండ్‌లో తుస్సార్‌ క్రికెట్‌ ఆడుతూ ఒక్కసారి కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.

దీనిపై రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుండెపోటుతో తుస్సార్‌ చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.