మే 23న కౌంటింగ్ రోజు భారీ ఉగ్రదాడికి స్కెచ్

ఇటీవల సొపియాన్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాదుల్లో ఓ ఉగ్రవాది మృతదేహం నుంచి ఉగ్రకుట్ర కోసం గీసిన స్కెచ్ ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. శ్రీనగర్, అవంతిపుర ఎయిర్ బేస్ లపై దాడి చేయాలన్నట్టుగా ఆ స్కెచ్ దట.

మే 19తో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. మే 23న ఎన్నిక ఫలితాలు వస్తాయి. ఇప్పటికే ఎన్నికల్లో మేం గెలుస్తామంటే.. మేం గెలుస్తామని ప్రధాన పార్టీలన్నీ చెప్పేసుకుంటున్నాయి. దేశమంతా ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ లోనే ఉంది. అయితే.. ఎన్నికల కౌంటింగ్ జరిగే మే 23న భారీ విధ్వంసకాండకు తెరలేపాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారట.

Terrorists sketch on may 23 to attack airbases

అదును చూసి ఇండియాలో మే 23న ఉగ్ర దాడి చేయాలని టెర్రరిస్టులు భారీ స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు… శ్రీనగర్, అవంతిపుర వైమానిక స్థావరాలను టార్గెట్ చేశారట. ఈ విషయం ఓ ఉగ్రవాది దగ్గర లభ్యమైన మ్యాప్ ద్వారా తెలిసింది.

Terrorists sketch on may 23 to attack airbases

ఇటీవల సొపియాన్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాదుల్లో ఓ ఉగ్రవాది మృతదేహం నుంచి ఉగ్రకుట్ర కోసం గీసిన స్కెచ్ ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. శ్రీనగర్, అవంతిపుర ఎయిర్ బేస్ లపై దాడి చేయాలన్నట్టుగా ఆ స్కెచ్ ఉందట. ఉగ్రదాడికి ఈనెల 14నే స్కెచ్ గీశారట. పుల్వామాలో ఉగ్ర కమాండర్స్ భేటీలో హిజ్బుల్ ముజహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన పలువురు, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన పలురు ఉగ్రవాదులు పాల్గొని ఎయిర్ బేస్ లపై దాడికి వ్యూహం రచించారట. ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తుండటం.. దానితో పాటు మే 23న ఓట్ల లెక్కింపు ఉండటంతో.. ఆరోజు దాడి చేసి భారత్ లో విధ్వంసం సృష్టించాలని ఉగ్రవాదులు ప్లాన్ చేసుకున్నారని.. నిఘావర్గాలు వెల్లడించాయి.