భోపాల్ – హైదరాబాద్ ఉగ్ర కోణంలో బయటపడుతున్న కీలక విషయాలు

-

భోపాల్ – హైదరాబాద్ ఉగ్ర కోణంలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఏటీఎస్ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులు కీలక విషయాలని బయటపెట్టారు. హైదరాబాద్- భోపాల్ యువకులకు జిమ్ ట్రైనర్ యసిర్ ఉగ్ర శిక్షణ ఇచ్చాడు. భోపాల్ శివార్లలో యువకులకు హెచ్యూటీ శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. యువకులకు ఫిధాయీ దళాల పేరుతో శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.

హెచ్.యూ.టీ కోడ్ భాషలో ఫిధాయీ అంటే.. ఆత్మాహుతి దాడి అని గుర్తించారు. 16 మంది హిజ్బుత్ సభ్యులను లోతుగా విచారిస్తున్నారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం. భోపాల్ లోని.. భోజ్ పురా సమీపంలోని రైసన్ అడవుల్లో యువతకు ఉగ్రకర్యకలాపాలపై శిక్షణ ఇచ్చినట్లు విచారణలో వెళ్లడైంది. అరెస్ట్ అయిన వారి వద్ద పలు వీడియోలు.. కోడ్ భాషలో వున్న 50 కి పైగా ఆడియోలను స్వాధీనం చేసుకున్నారు.

భోపాల్ లోని శాంతి ద్వీపం పెల్చేయలి అన్న కోడ్ భాషను డీకోడ్ చేశారు ATS పోలీసులు. శాంతి ద్వీపం పేల్చడం అంటే… బాంబు పేలుళ్ళు జరపడం అని గుర్తించారు. భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్, మోతీలాల్ నెహ్రూ స్టేడియం , బరాసియా డ్యాం వద్ద బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాల కోసం.. విదేశాల నుండి హవాలా మార్గం లో నిధులు వచ్చినట్టు గుర్తించారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) బృందం.

Read more RELATED
Recommended to you

Latest news