క్యాసినో వ్యవహారంలో కోట్ల రూపాయల హవాలా జరిగినట్లు గుర్తించిన ఈడి

క్యాసినో  వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. చికోటి ప్రవీణ్, సంపత్ ఆర్థిక లావాదేవీలను ఈడి అధికారులు పరిశీలించారు. తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నేతలకు చీకోటి ప్రవీణ్ బినామీగా ఉన్నట్లు ఈడి అధికారులు అనుమానిస్తున్నారు. కోట్ల రూపాయలు హవాలా ద్వారా లావాదేవీలు జరిగినట్లు ఈడి అధికారులు గుర్తించారు. కమిషన్ల రూపంలో చీకోటి ప్రవీణ్ కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు గుర్తించారు. నేపాల్ శ్రీలంక థాయిలాండ్ ఇండోనేషియా లో 7 క్యాసినో క్యాంపులు ఏర్పాటు చేసినట్లు ఆధారాలు సేకరించారు.

సోమవారం చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి, సంపత్ లను ఈడి అధికారులు మరోసారి ప్రశ్నించనున్నారు.మరోవైపు క్యాసినో తో సంబంధం ఉన్న మరో ముగ్గురికి ఈడి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఈడి కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని పేర్కొంది.