లక్నోలో భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి

-

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. దాదాపు 15 నుంచి 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ అపార్ట్​మెంట్​లో 7 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇప్పటివరుకు 8 మందిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఆ అపార్ట్​మెంట్​ బేస్​మెంట్​లో కొన్ని రోజులుగా పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఉత్తరాదిలో మంగళవారం భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ నేపథ్యంలోనే భవనం కూలిపోయినట్లు సమాచారం.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే అర్బన్​ డెవెలప్​మెంట్ అధికారి ఏకే మిశ్ర, అధికారులు ఘటనా స్థలిని పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news